
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర మొదలైంది. నానక్ రామ్ గూడలోని పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్తానం వరకు ఈ అంతిమయాత్ర సాగనుంది. మహాప్రస్తానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణ అభిమానుల రాకతో నానక్ రామ్ గూడలో ఫుల్ రష్ ఏర్పడింది. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెలంగాణతోపాటు ...ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ భారీగా వస్తున్నారు. ఇటు నానక్ రామ్ గూడ, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కృష్ణ మృతదేహానికి గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు. ఆ తర్వాత మహేశ్ బాబు కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు.. బాలకృష్ణ, ఇతర ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.