
కార్తికేయ డైరెక్షన్ లో పరుచూరు రవి, నరేష్ మేడి,ఆదర్శ్,పెద్దిరాజు, ప్రతీక్ష,అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్ లు కలసి సంయుక్తంగా నిర్మించిన సినిమా కృష్ణలంక. నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రో ఆఫ్ కృష్ణలంక వీడియోని విడుదల చేసింది యూనిట్. ఈ మూడు నిముషాల వీడియోలో అందరి క్యారెక్టర్స్ లను పరిచయం చేశాడు డైరెక్టర్. హైటెక్నికల్ వాల్యూస్ తో నిర్మించిన కృష్ణలంక, ప్రేమకు పగకు మద్య జరిగే యుద్దాన్ని పరిచయం చేసినట్లు తెలుస్తుంది. పరుచూరి వెంకటేశ్వరావు కుమారుడు పరుచూరి రవి పాత్ర బాగుంది. అంతా కొత్త వారితో కార్తికేయ తనదైన స్టైల్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది.