కృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్ వాయిదా

కృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రీమెంబర్​ కమిటీ మీటింగ్ వాయిదా పడింది. గురువారం జలసౌధలో నిర్వహించాల్సిన సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది. ఎల్‌‌నినో నేపథ్యంలో కృష్ణా జలాలను తాగునీటి అవసరాలకు కేటాయించేలా త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌‌ను నిర్వహించాలని ఈ నెల 4న కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

రెండు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని లేఖలో కోరింది. ఈ నేపథ్యంలోనే 13న త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌‌ను నిర్వహిస్తామని రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది. అయితే, గురువారం మీటింగ్ ఉన్నా.. రెండు రాష్ట్రాల నుంచి ఎజెండా అంశాలేవీ అందలేదు. తొలుత మీటింగ్‌‌లోనే నేరుగా చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపినా.. అది సాధ్యపడదని భావించినట్టు తెలిసింది. అందుకే సమావేశాన్ని బోర్డు సోమవారానికి వాయిదా వేసిందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు