9న కేఆర్‌‌ఎంబీ త్రిసభ్య‌‌ కమిటీ సమావేశం

9న కేఆర్‌‌ఎంబీ త్రిసభ్య‌‌ కమిటీ సమావేశం
  • మే వరకు నీటి అవసరాలపై చర్చ

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (కేఆర్‌‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 9న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ఈఎన్సీలకు మంగళవారం లెటర్‌‌ రాశారు. వెబినార్‌‌ ద్వారా జలసౌధ నుంచి కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ ఈ సమావేశం నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు తమ ఆఫీసుల నుంచే వెబినార్‌‌లో పాల్గొననున్నారు. శ్రీశైలంలో మినిమం డ్రా లెవల్ కంటే నీటి మట్టం పడిపోవడంతో తాము 810 అడుగుల లెవల్‌‌ నుంచి నీటిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కృష్ణా బోర్డుకు ఏపీ లెటర్‌‌ రాసింది. ప్రధానంగా ఇదే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. నాగార్జునసాగర్‌‌లో ఏ లెవల్‌‌ వరకు నీటిని తీసుకోవాలి, మే నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు ఎంతమేరకు నీళ్ల అవసరం ఉంది అనే అంశాలపైనా చర్చిస్తారు. రెండు రాష్ట్రాలు ఈ వాటర్‌‌ ఇయర్‌‌లో మార్చి నెలాఖరు వరకు ఉపయోగించుకున్న నీటి లెక్కలపైనా చర్చించనున్నారు.