కృష్ణా ట్రిబ్యునల్ విచారణ జనవరి 22కు వాయిదా

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ జనవరి 22కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ అంశంపై విచారణను కృష్ణా ట్రిబ్యునల్ జనవరి 22కు వాయిదా వేసింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. బుధ, గురు వారాల్లో ట్రిబ్యునల్ భేటీ కావాల్సి ఉంది. అయితే స్టేట్మెంట్ ఆఫ్ కేసు ఫైల్ చేయాలని తెలంగాణ, ఏపీలను ఆదేశించిన ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పున:పంపిణీ, అక్టోబర్ 6న కేంద్రం జారీ చేసిన కొత్త విధానాలపై విచారణ జరపాల్సి ఉంది. మరోవైపు కేంద్రం జారీ చేసిన గెజిట్ పై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా ట్రిబ్యునల్‌‌–2 టర్మ్స్‌‌ ఆఫ్‌‌ రిఫరెన్స్‌‌ (టీవోఆర్‌‌) అంశంపై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలంటూ అప్లికేషన్ ఫైల్ చేసింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.