‘దిశ’ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా

‘దిశ’ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా

IAS ఆఫీసర్ కృతికా శుక్లాను ‘దిశ’ ప్రత్యేక అధికారిగా నియమించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు గాను దిశ ప్రత్యేక అధికార కార్యాలయం నుంచి లెటర్ విడుదల అయింది. ఇందులో… సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు.. మహిళల రక్షణే ధ్యేయంగా చట్టం రూపొందిచామని తెలిపారు అధికారులు. దిశ చట్టం రూపకల్పనలో కృతికా శుక్లా ముఖ్యమైన పాత్రను పోషించారని చెప్పారు. చట్టం రాష్ట్ర పతి ఆమోదం పొందవలసి ఉండగా.. ఇప్పటికే అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం  స్పీడప్ చేసింది.

లైంగికవేధింపులకు గరై.. ఆరోగ్యం పాడయిపోయిన వారి అప్డేట్స్ కూడా శుక్లా టీం పరిశీలిస్తదని తెలిపారు అధికారులు. లైంగిక చర్యకు గురైన వారికి… జీరో FIR నమోదుతో సహా బాధితులకు అన్ని రకాల  సామాజిక, చట్టపరమైన సహాయం అందించటంతో పాటు, వారిలో మానసిక స్ధైర్యాన్ని నింపే తీరుగా  దిశ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు.