ఆర్టీసీ బస్సులా.. WWE కోర్టులా.. ప్రతి బస్సులో కొట్లాటలే..

ఆర్టీసీ బస్సులా.. WWE కోర్టులా.. ప్రతి బస్సులో కొట్లాటలే..

మహిళలను ఉద్దేశించి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ జర్నీ పథకం(శక్తి యోజనె) గొడవలకు కారణమవుతోంది. ఉచిత ప్రయాణం కావడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఊరి బస్సు చూసినా జాతర, తిరుణాళ్ల వేళను తలపిస్తున్నాయి. దీంతో సీట్ల కోసం మహిళలు గొడవలకు ఎగబడుతున్నారు. చుట్టూ తోటి ప్రయాణికులు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా చీరలు లాగి మరీ కొట్టుకున్నారు.

దాదాపు 20 శాతం బస్సుల్లో ప్రతిరోజూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయని కండక్టర్లు చెప్తున్నారు. పోనీ, చుట్టూ ఉన్న వారు.. వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే అదీ లేదు. WWE యాక్షన్ సీన్లను చూసినట్టు కళ్లు అప్పగించి చూస్తున్నారు. మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ ఎఫెక్ట్ .. కొట్టుకున్న మహిళలు

కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో రద్దీ పెరిగింది. బస్సులో సీట్ల కోసం చీరలు లాగి మరీ కొట్టుకున్నారు.#KarnatakaNews #Karnataka #KSRTC pic.twitter.com/3YlLv8fKOZ

— Telugu Scribe (@TeluguScribe) June 20, 2023
ALSO READ: ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు కదా.. జీతాలు తగ్గించుకోండి..