
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రవేశ పెట్టన పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపిస్తున్నారన్నారు. మున్సిపల్ మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలించారు.