రేవంత్ బీజేపీలో చేరుతడు.. ఎలక్షన్ల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలతో జంప్

రేవంత్ బీజేపీలో చేరుతడు.. ఎలక్షన్ల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలతో జంప్
  • కాంగ్రెసోళ్లు కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర్‌మెంట్‌ పెడ్తరు
  • కాంగ్రెస్, బీజేపీ వాళ్లను దబాయించి పైసలు అడుగుండ్రి
  • తెలంగాణ ప్రజలే మా టీం: ఐటీశాఖ మంత్రి కేటీఆర్​

రంగారెడ్డి: ఎన్నికల తర్వాత గెలిచిన 10–--12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుడు ఖాయం అని కేటీఆర్​ ఆరోపించారు. అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ పార్టీ.. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఇవాళ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కేటీఆర్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మేం ఎవరికి బీ -టీం కాదు.. తెలంగాణ ప్రజలే మా టీం. బీజేపీ వాళ్లకు అదానీ నుంచి బాగా పైసలు వస్తున్నాయట. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లను దబాయించి పైసలు అడుగుండ్రి. రైతుబంధు అందితేనే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు వస్తేనే మాకు ఓటేయండి. తొమ్మిదేండ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. కాంగ్రెసోళ్లు కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర్‌మెంట్‌ పెడతారు.

బీజేపోళ్లు నీళ్ల వాటా తేల్చరు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్ అని కాంగ్రెస్‌ నేతలే చెప్పారు. ఈ విషయంపై పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్​రెడ్డి ఓ గాడ్సే. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీజేపీలోకి జంప్‌ అవుతారు’అని కేటీఆర్​ఆరోపించారు.