బీజేపీ యాక్షన్ స్టార్ట్..ఎన్నికల కోసం 14 కమిటీలు

బీజేపీ యాక్షన్ స్టార్ట్..ఎన్నికల కోసం 14 కమిటీలు
  • ఎన్నికలకు వేగం పెంచిన కమలనాథులు
  • 14 కమిటీలను ప్రకటించిన రాష్ట్ర నాయకత్వం
  • మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి
  • స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • పోరాటాల కమిటీ చైర్ పర్సన్ గా విజయశాంతి
  • పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్ కుమార్
  • సోషల్ మీడియా బాధ్యతలు అర్వింద్ కు, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావు
  • ఈ నెల 10న ఆదిలాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • బీజేపీ స్టేట్ ఆఫీసులో కొనసాగుతున్న పదాధికారుల సమావేశం

హైదరాబాద్: త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికలకు యాక్షన్ స్టార్ట్ చేసింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు 14 కమిటీలను వేసింది. కీలకమైన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని నియమించింది. ఈ కమిటీ కన్వనీర్ గా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వ్ రెడ్డిని, జాయింట్ కన్వీనర్ గా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని నియమించింది. టికెట్ల కేటాయింపులో కీలకమైన స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ కు కన్వీనర్ గా అవకాశం కల్పించింది. మాజీ ఎంపీ విజయశాంతికి పోరాటాల కమిటీ చైర్ పర్సన్ బాధ్యతలను అప్పగించింది. ఆ కమిటీకి గంగిడి మనోహర్ రెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారని తెలిపింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించింది.దీంతో పాటు మీడియా బాధ్యతలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు, సోషల్ మీడియా వ్యవహారాలను నిజామాబాద్ మాజీ ఎంపీ అరవిద్ కు అప్పగించింది. 

10న ఆదిలాబాద్ కు అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ పర్యటనలతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పాలమూరు సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్ట ప్రకటించిన మోదీకి నిజామాబాద్ లో టర్మరిక్ రైతులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా మోదీ చేసిన ప్రసంగం బీజేపీలో ఉత్సాహం నింపింది. దీనికి కొనసాగింపుగా ఈ నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనాన్ని సమకూర్చేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే నిర్మల్, కరీంనగర్ లో మోదీ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. 

పదాధికారుల సమావేశం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ నాయకులు సునీల్ బన్సల్, తరుణ్​ చుగ్, ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. 

బీజేపీ నియమించిన 14 కమిటీలు

క్ర.సం    కమిటీ                                       చైర్మన్                                 కన్వీనర్/ కో కన్వీనర్

   1       మ్యానిఫెస్టో                           వివేక్ వెంకట స్వామి           ఏలేటి మహేశ్వర్ రెడ్డి/ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
   2        స్క్రీనింగ్                           కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి              దుగ్యాల ప్రదీప్ కుమార్
   3.     పోరాటాల కమిటీ                       విజయశాంతి                             గంగిడి మనోహర్ రెడ్డి
   4.     పబ్లిక్ మీటింగ్                          బండి సంజయ్                  ప్రేమేందర్ రెడ్డి/ కాసం వెంకటేశ్వర్లు
   5.     మీడియా                                 రఘునందన్ రావు                    ఎన్ రామచంద్రరావు/ ప్రకాశ్​ రెడ్డి
   6.     సోషల్ మీడియా                     ధర్మపురి అర్వింద్                            పోరెడ్డి కిషోర్ రెడ్డి
   7.       చార్జిషీట్                                 మురళీధర్ రావు                        యెండల లక్ష్మీనారాయణ/ చింతల రామచంద్రారెడ్డి/ రామచంద్రుడు
   8.     సోషల్ ఔట్ రీచ్                       డాక్టర్ కే లక్ష్మణ్​                            బూర నర్సయ్య గౌడ్
   9.    ఇన్ ఫ్లుయెన్సర్ ఔట్ రీచ్             డీకే అరుణ                                  పొంగులేటి సుధాకర్ రెడ్డి
  10.   ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్        మర్రి శశిధర్ రెడ్డి                               కపిలవాయి దిలీప్ కుమార్
11.    హెడ్ క్వార్టర్ కో ఆర్డినేషన్         ఎన్. ఇంద్రసేనారెడ్డి                              బంగారు శృతి
12.     క్యాంపెయిన్ ఇష్యూస్                    వెదిరె శ్రీరాం                               ఎన్ వీవీఎస్ ప్రభాకర్
13.    ఎస్సీ సెగ్మెంట్ల సమన్వయం       జితేందర్ రెడ్డి                                విజయ రామారావు
14.    ఎస్టీ సెగ్మెంట్ల సమన్వయం         గరికపాటి మోహనరావు               సోయం బాపురావు/రవీంద్రనాయక్