రంజీ మాజీ ప్లేయర్..కేటీఆర్ పీఏనంటూ బడా కంపెనీకి టోకరా

రంజీ మాజీ ప్లేయర్..కేటీఆర్ పీఏనంటూ బడా కంపెనీకి టోకరా

ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. తాను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పీఏనని చలామణీ అయ్యాడు. తనకు పలుకుబడి ఉందని నమ్మించి బడా కంపెనీలకు టోకర వేసి లక్షలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. కటకటాలపాలయ్యాడు.  ఈ ఘటన శ్రీకాకుళంలో జరిగింది.

సైబర్ క్రైం పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంజీ మాజీ ఆటగాడు నాగరాజు అనే వ్యక్తి ఈజీ మనీ కోసం మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డి నంటూ చలామనీ అయ్యాడు. మొబైల్ నంబర్ ను ట్రూ కాలర్ లో కేటీఆర్ పీఏ అని ఫీడ్ చేసుకున్నాడు. 2019లో ప్రైమ్ ఇండియా కంపెనీ సీఎండీకి ఫోన్ చేశాడు. బ్రిటన్ లో జరగనున్న టీమిండియా అండర్ 25 క్రికెట్ మ్యాచ్ కు నాగరాజు అనే నిరుపేద వ్యక్తి సెలక్ట్ అయ్యాడని చెప్పాడు. అతనికి  క్రికెట్ కిట్ కోసం రూ.3.50 లక్షలలు సాయం చేస్తే అతడి క్రికెట్ కిట్ పైన మీ కంపెనీ లోగో వేయిస్తానని నమ్మించాడు. ఆ కిట్లను కూడా కేసీఆర్, కేటీఆర్ చేతుల మీదుగా ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆ కంపెనీ సీఎండీ మూడున్నర లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే మరికొన్ని రోజులకు మరోసారి అదే కంపెనీ సీఎండీకి నాగరాజు ఫోన్ చేసి ఈ సారి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడననన తనకు ఈ విషయం ముందే తెలుసని చెప్పాడు.ఫ్రిబ్రవరిలో కేటీఆర్ ప్రమాణస్వీకారం ఉంటుందని.మీ కంపెనీకి స్పాన్సర్ ఇప్పిస్తానని చెప్పాడు.అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన ఫ్రెండ్ ట్రీట్ మెంట్ కు  రెండు లక్షలు కావాలని కోరాడు. మరోసారి డబ్బులు అడగడంతో డౌట్ వచ్చిన కంపెనీ వాళ్లు నాగరాజు అనే క్రికెటర్ గురించి సెర్చ్ చేశారు. అతడిపై చీటింగ్ కేసులున్నట్లు తెలవడంతో తాము మోసం పోయామని గ్రహించారు. దీంతో ఆ కంపెనీ క్లర్క్  సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నాగరాజు సెల్ నంబర్ ఆధారంగా అతడిని విశాఖలో అరెస్ట్ చేశారు పోలీసులు. శనివారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.