BJPకి తెలంగాణలో ఒక్క సీట్ కూడా రాదు: KTR

BJPకి తెలంగాణలో ఒక్క సీట్ కూడా రాదు: KTR

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్…. 5 స్థానాల్లో మూడో ప్లేస్ కి కాంగ్రెస్ పడిపోతుందన్నారు. BJPకి తెలంగాణలో చోటు లేదన్న కేటీఆర్… తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవదని అన్నారు. ఎన్నికల్లో TRS 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెదక్ లో నెంబర్ 1 మెజార్టీ.. వరంగల్ లో నెంబర్ 2 మెజారిటీ రావచ్చన్నారు.

మే20 లోపు లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి కావాలని సీఎం కోరుకుంటున్నారన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం తెవాల్సి ఉందని.. ఆ చట్టం వచ్చిన తర్వాత  మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు  అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు.

మన దగ్గర ఎన్నికలు జరిగితే ప్రశాంతంగా చార్మినార్‌ దగ్గర పిల్లలు క్రికెట్ అడుకున్నారన్న కేటీఆర్…. ఏపీ లో హత్యలు… ఆందోళనలు జరిగాయిన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు అన్నీ పూర్తి అయితే  అభివృద్ధిపై పూర్తి దృష్టి సారిస్తామన్నారు. 16 సీట్లు గెలిచిన తర్వాత కేంద్రంలో  తాము కూడా కీలకమవుతామని భావిస్తున్నామన్నారు.

ఎన్నికల విషయం మాట్లాడుతూ… 2014లో చంద్రబాబు EVM లో గేలవలేదా అని ప్రశ్నించారు. బాబు పని అయిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యం లో హుందాతనం ఉండాలన్నారు. ఏదో ఒక్క పథకంతో ఓట్లు పడవని… అన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉంటేనే గెలుస్తారన్నారు.

సీఎం కేసీఆర్, జగన్… ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు అని చంద్రబాబు ఎలా మాట్లాడతారు బుర్ర ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగేళ్లు మోడీతో కలిసి ఉన్నారు కదా… ఈయన పెంపుడు కుక్క కాదా అని అన్నారు. మా అంచనా ప్రకారం కేంద్రంలో సంకీర్ణం ప్రభుత్వమే వస్తుందన్నారు.

దక్షిణాన రాహుల్ గాంధీ పోటీ చేసినా  పెద్దగా ఇంపాక్ట్ ఉండదన్నారు. జనామోదం లేనప్పుడు ఎక్కడ పోటీచేసినా ఉపయోగం ఉండదని చెప్పారు. “చంద్రబాబు కుప్పం.. జగన్ పులివెందుల దాటలేదు. కానీ కేసీఆర్ వేరు. ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. జనామోదం ఉన్న నాయకుడు అంటే కేసీఆరే” అని చెప్పారు కేటీఆర్.

పారదర్శక పాలనను ఉద్యోగులు,ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తారని అనుకుంటున్నానని చెప్పారు  కేటీఆర్. రెవెన్యూ ఉద్యోగులలో మెజార్టీగా మంచి వాళ్లు ఉన్నారు కొంత మంది కారణంగానే సమస్య వస్తోందన్నారు. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లు …. ఏపీ కి వెళ్లి ఓట్ వేయడంతో వారి మేము ఓట్లు కోల్పోయామన్నారు. గత ఎన్నికల్లో వారు మాకే సపోర్టు ఇచ్చారన్నారు కేటీఆర్. ఎన్నికల కమిషన్ లో సంస్కరణలు తీసుకురావాలి.. ఓటు హక్కు అనేది అందరికి తప్పకుండా ఉండాలన్నారు. అంతేకాదు ఓటు కోల్పోకుండా చూసుకోవాలని సూచించారు.