 
                                    - ఇంకో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది
- ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది మాగంటి సునీతనేనని.. ఇది కారు, బుల్డోజర్ మధ్య జరిగే ఎన్నిక అని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రౌడీయిజం పెరిగిపోయిందని.. రెండేండ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించించారని ఫైర్అయ్యారు. తెలంగాణ భవన్‌లో పలువురు ఎంఐఎం నేతలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలు చేయలేదు.
ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే.. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయండి. ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నరు. పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందట.. వాడికంటే మనకు తెలివి ఎక్కువే ఉంది. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. ప్రజలకు మేము ఎప్పటికీ అండగా ఉంటం’ అని భరోసా ఇచ్చారు.

 
         
                     
                     
                    