
రాష్ట్రానికి అండగా తాముంటే.. దేశానికే దండగగా బీజేపీ వాళ్లున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘పాతబస్తీలోని అనేక వందల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఎంఐఎంకి మద్దతిచ్చిన టీఆర్ఎస్ నాయకులా ధర్మాలను ప్రబోధించేది. ప్రధానమంత్రి హాజరైన ఒక ఈవెంట్‌ను రాజకీయం చేయడం హాస్యాస్పదంగా ఉంది’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వకున్నా.. ఐటీ కంపెనీలు తెచ్చుకున్నామని కేటీఆర్ అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుంటే.. ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా.. ఆ ప్రాజెక్టును కట్టుకున్నామని కేటీఆర్ అన్నారు.
మొన్న..
— KTR (@KTRTRS) February 7, 2022
ITIR ఇవ్వకున్నా..
దిగ్గజ ఐటి కంపెనీలు తెచ్చుకున్నం
నిన్న..
జాతీయ హోదా ఇవ్వకున్నా..
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం
నేడు..
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా..
ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నం
ఒక్క మాటలో
చెప్పాలంటే,
రాష్ట్రానికి అండగా మేము..
దేశానికే దండగ మీరు!!! https://t.co/6MweRhEpVH