దేఖ్ లేంగే అంటూ... స్టేప్పులేసిన కేటీఆర్

దేఖ్ లేంగే అంటూ... స్టేప్పులేసిన కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో తన డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుడే మంత్రి కేటీఆర్.. ఓ సభలో మాత్రం డాన్స్ చేసి యువతను ఉర్రూతలూగించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపుతున్నారు. 

 ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.  దేఖ్ లేంగే పాటా చూసారా అంటూ యువతను అడిగిన కేటీఆర్.. పాటను వినిపించి.. సభా వేధికపైనే కార్యకర్తలు, నాయకులు, యువతతో కలిసి స్టేప్పులేశారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల అవుతోంది.