
కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవన్నారు. రాష్ట్రం నుంచి ఎన్ని రిక్వెస్టులు పెట్టినా పట్టించుకోలేదన్నారు. నితీ ఆయోగ్ …మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథ పథకాలకు డబ్బులు కేటాయించాలని సూచించినా లైట్ తీసుకున్నారన్నారు.
ముందు నుంచి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు. మరోవైపు ఈసారి బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ దక్కకపోవటం బాధాకరమన్నారు మాజీ ఎంపీ కవిత.