కాంగ్రెస్​, బీజేపీ ఎగిరెగిరి పడుతున్నయ్ : కేటీఆర్​

కాంగ్రెస్​, బీజేపీ ఎగిరెగిరి పడుతున్నయ్ : కేటీఆర్​

హుజూర్​నగర్​ ఓటర్లు
విలక్షణ తీర్పు ఇవ్వాలి: కేటీఆర్​

నీలగిరి, వెలుగు: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండ  నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హుజూర్ నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తంచేశారు. రాజకీయ చైతన్యం కలిగిన హుజూర్​నగర్ ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వాలని, ఇతర పార్టీల నాయకులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎగిరెగిరి పడుతున్నాయని విమర్శించారు.

గతంలో కారులో డబ్బులు తరలిస్తూ వాటిని తగులబెట్టిన నీచ నాయకుడు ఉత్తమ్​కుమార్  రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు. యాదాద్రి లో ఎయిమ్స్ ను ఏర్పాటు చేసిన ఘనత, యాదాద్రి పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​దేనని పేర్కొన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు స్వచ్ఛమైన నదీ జలాలను భగీరథ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.