‘వర్క్ ఫ్రం హోం’లో కేటీఆర్.. పిక్ వైరల్

‘వర్క్ ఫ్రం హోం’లో కేటీఆర్.. పిక్ వైరల్

ఎడమకాలికి గాయం కావడంతో.. మంత్రి కేటీఆర్ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడువారాల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో.. ఇంటి దగ్గరి నుంచే ఆయన తన శాఖలకు సంబంధించిన పనులను ఆయన చక్కబెడుతున్నారు. శాఖలకు సంబంధించిన ఫైల్స్ ను తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఈవిధంగా ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ఫొటోను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘గెట్టింగ్ సమ్ ఫైల్ వర్క్ డన్’ అని దానిపై కేటీఆర్ కామెంట్ చేశారు.

నెటిజన్లు స్పందించారు

ఈ ఫొటోపై నెటిజన్లు స్పందించారు. ‘అవిశ్రాంత శ్రామికుడు’ అని కొందరు కామెంట్స్ పెట్టగా, ‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటూ ఇంకొందరు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నం’ అంటూ మరికొందరు వ్యాఖ్యలు చేశారు. కాగా, హైదరాబాద్ లోని మహీంద్ర యూనివర్సిటీలో తొలి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఎడమకాలికి గాయం అయిందంటూ ఆయన జులై 23న  ట్వీట్ చేశారు.