నిజాం కాలేజ్ లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది: కేటీఆర్

నిజాం కాలేజ్ లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది: కేటీఆర్

నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. నిజాం కాలేజ్ లో 1993- 96 వరకు చదువుకున్నానని..  కాలేజీకి మంచి పేరుందున్నారు.  నిజాం కాలేజీలో  క్లాస్ రూం కాంప్లెక్స్, బాయ్స్ హాస్టల్ బ్లాక్ కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  స్టేట్  యూనివర్సిటీల్లో  నిజాంకాలేజీకి  4వ  ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు.


మాజీ  సీఎం కిరణ్ కుమారెడ్డి ఇదే నిజాం కాలేజీలో చదివినా నిధులివ్వలేదని విమర్శించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో  నిజాం కాలేజ్ కు రూ. 40 కోట్లు అందజేశామన్నారు.  మరో ఏడాదిలో భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ కు ఇబ్బందులు రాకుండా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు.  రాష్ట్రానికే తలమాణికం ఓయూ అని అన్నారు కేటీఆర్. 144 కోట్లతో ఓయూలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవ్ లప్ మెంట్ జరుగుతుందన్నారు.