గజం రూ.లక్ష పలుకుతున్న స్థలంలో పేదలకు ఇళ్లు

V6 Velugu Posted on Jun 16, 2021

డబుల్ బెడ్రూం ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ఎల్లారెడ్డి పేటలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. దశలవారిగా ఇళ్లు పూర్తి చేసి అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు ఇంటిని కేటాయిస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వలేదన్నారు. ఎల్లారెడ్డిపేటలో గజం భూమి లక్షా 50 వేలు పలుకుతోందని.. అయినా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించామన్నారు. పేదవారి ముఖంలో సంతోషం చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటితో నల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో 4.7లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. 
 

Tagged rajanna sirisilla, ellareddypeta mandal, KTR launche, double bedroom houses

Latest Videos

Subscribe Now

More News