
ఖమ్మం లీడర్లకు కేటీఆర్ క్లాస్ పీకారు మంత్రి కేటీఆర్. గురువారం ఖమ్మం లీడర్లతో సమావేశమై మాట్లాడిన కేటీఆర్. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు దురుసుగా ఉందని..కొత్త పాత అందరినీ కలుపుకొని పోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు కానీ.. నియోజక వర్గంలో పార్టీ బలంగా ఉండటం అవసరమన్నారు. పార్టీలో నాయకులంతా సమన్వయం చేసుకోవాలన్న కేటీఆర్..ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమన్వయం చేసుకోవాలన్నారు.
పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి ..కేవలం ఖమ్మానికే మంత్రి అనుకోవద్దన్నారు. నియాజక వర్గాల వారీగా అభివృద్ది పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ కు అందించారు ఎమ్మెల్యేలు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మంలో ఒక సీటే గెలిచిందని..ఈసారి మనం మెరుగు పడాలన్నారు. పాత విషయాలు పక్కన పెట్టి, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలన్నారు. జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని.. జమిలి వచ్చినా రాకున్నా మనం అలెర్ట్ గా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే.. జిల్లా నేతలతో కలిసి మీటింగ్ లో పాల్గొనకుండా.. కేటీఆర్ తో 10 నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయి వెళ్లిపోయారు మాజీ మంత్రి తుమ్మల.