ఇవాళ నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌కు కేటీఆర్‌‌‌‌‌‌‌‌

ఇవాళ నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌కు కేటీఆర్‌‌‌‌‌‌‌‌


హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం11 గంటలకు అచ్చంపేట టౌన్‌‌‌‌లోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారని ఆయన ఆఫీసు ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని తెలిపింది.