ఎంపీ అసదుద్దీన్ తో KTR భేటీ

ఎంపీ అసదుద్దీన్ తో KTR భేటీ

మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఆయన ఇంట్లో  కలిశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న రోజే… ఈ ఇద్దరు నాయకుల భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు….MLC ఎన్నికలు… రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేస్తానని అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ప్రచార అంశం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.