అధికారులు బలవంతం వల్లే.. తాత్కాలిక గోడ: 8 మంది భక్తుల మృతిపై కాంట్రాక్టర్ వివరణ

అధికారులు బలవంతం వల్లే.. తాత్కాలిక గోడ: 8 మంది భక్తుల మృతిపై కాంట్రాక్టర్ వివరణ

విశాఖ: సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఎనిమిది మంది మృతి భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్‎ల నిర్లక్ష్యం, డొల్లతనం అడుగడుగునా బయటపడుతోంది. అధికారులు బలవంతం చేయటం వల్లనే చందనోత్సవానికి ముందు తక్కువ సమయంలో గోడ కట్టానని కాంట్రాక్టర్ లక్ష్మణరావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి చెప్పారు.

అధికారుల ఒత్తిడి వల్లే గోడ తక్కువ టైంలో నిర్మించినట్టు కాంట్రాక్టర్ చెప్పడంతో.. ఒత్తిడి చేసిన అధికారులు ఎవరని ప్రశ్నించారు కమిటీ సభ్యులు. దీంతో ఆలయ డీఈ, ఈఈలు తనను ఒత్తిడి చేశారని కాంట్రాక్టర్ సమాధానమిచ్చాడు. దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్ లేకపోయినా గోడ నిర్మాణానికి ఒప్పున్నట్లు కాంట్రాక్టర్ వెల్లడించాడు.

ALSO READ | సింహాచలం ఆలయం​లో గోడ కూలి 8 మంది మృతి

నిర్మాణం అనంతరం గోడ నాణ్యత పరిశీలించారా..? ఏ ల్యాబ్‎లో పరిశీలించారని కమిటీ ప్రశ్నల వర్షం వర్షం కురిపించగా.. 8 మంది భక్తులు చనిపోయారన్న కనీస పశ్చాతాపం లేకుండా చాలా నిర్లక్ష్యంగా అధికారులకు కాంట్రాక్టర్ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ‘ఉన్నది ఉన్నట్టు చెబుతాను.. ఏమైనా పీకలు తీసేస్తారా..? కావాలని ఎవ్వరు చేయరు’ అంటూ కాంట్రాక్టర్ లక్ష్మణరావు నిర్లక్ష్యంగా మాట్లాడటం చూస్తే ఈ సంఘటన విషయంలో కాంట్రాక్టర్‎తో పాటు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.