లోకల్ భాష తెలిసిన వారిని నియమించుకోండి

లోకల్ భాష తెలిసిన వారిని నియమించుకోండి

హైదరాబాద్: ప్రాంతీయ భాషలను గౌరవించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇండిగో ఫ్లైట్ యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో సరిగ్గా మాట్లాడలేని  ప్యాసెంజర్లను గౌరవించడం నేర్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. ప్రాంతీయ రూట్లలో ప్రయాణించే విమానాల్లో తెలుగు, తమిళం, కన్నడ మొదలగు ప్రాంతీయ భాషలు మాట్లాడే సిబ్బందిని ఎక్కువగా నియమించుకోవాలన్నారు. తన సలహా ఇండిగో మేనేజ్ మెంట్ కు మంచి పరిష్కారం అవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

 

ఇక.. అంతకు ముందు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఇండిగో  (IndiGo 6E 7297) ఫ్లైట్ లో ఓ తెలుగు మహిళకు జరిగిన అవమానం గురించి దేవస్మిత చక్రవర్తి అనే ప్రొఫెసర్ కేటీఆర్ కు ట్వీట్ చేశారు.  ఫ్లైట్ లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ శ్రేణిలో కూర్చున్న ఓ తెలుగు మహిళను ఇంగ్లీష్, హిందీ మాట్లాడని కారణంగా సిబ్బంది అవమానించారని తెలిపారు. సెక్యూరిటీ కారణాలు చెబుతూ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి లేపి వేరే సీటులో కూర్చోబెట్టారని కంప్లైంట్ చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ ... దేవస్మిత చక్రవర్తి ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ IndiGo 6E యాజమాన్యానికి ట్వీట్ చేశారు.