
నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదు. ఇంతకుముందే నేను చెప్పాను.. నిజామాబాద్ లో నామినేషన్స్ వేసింది రైతులు కాదు.. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలే. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి కాబట్టే నిజామాబాద్‌లో కవిత ఓడింది. ఈ ఓటమితో తాము కుంగిపోబోము. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి వచ్చి ఉంటె టీఆరెస్ కు నష్టం వచ్చేది అనే మాటలతో మేము ఏకీభవించము.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మోడీతో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయి. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి.. నేను కాదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు’ అని కేటీఆర్ అన్నారు.