జీడీపీ పడిపోవడానికి కారణం మూడు ‘డీ’లే  

జీడీపీ పడిపోవడానికి కారణం మూడు ‘డీ’లే  

కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా  కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే మూడు ‘ఐ’లు కావాలన్నారు.  మూడు ‘డీ’ల వల్ల ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోందని మండిపడ్డారు. కలిసికట్టుగా కృషి చేస్తే.. సరికొత్త ఆవిష్కరణలు ( ఇన్నోవేషన్) , మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రాస్ట్రక్చర్), సమ్మిళిత వృద్ధి (ఇంక్లూసివ్ గ్రోత్)ని దేశం సాధిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన వాదం (డివిజన్),  ఎగతాళి (డెరిషన్), వాగ్ధాటి (డెమగోగెరీ)పై అత్యున్నత నాయకత్వం దృష్టిపెడితే..  దేశం విఫలమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కారణాల వల్లే మన దేశ జీడీపీ విలువ పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ 1987 సంవత్సరం నాటికి  చైనా, భారత్ ల జీడీపీ విలువ దాదాపు సరి సమాన స్థాయిలో.. చెరో 470 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 సంవత్సరం వచ్చేసరికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది చైనా జీడీపీ విలువ 16 ట్రిలియన్ డాలర్లు కాగా, భారత జీడీపీ విలువ 3.1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. జీడీపీ విలువల గణాంకాలతో నాయిని అనురాగ్ రెడ్డి అనే వ్యక్తి షేర్ చేసిన పోస్ట్ ను .. కేటీఆర్ తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.