వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై 2021 నుంచే మద్దతిస్తున్నా: కేటీఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై 2021 నుంచే మద్దతిస్తున్నా: కేటీఆర్

ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొందరు తనను ప్రశ్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి తాను 2021 నుంచే మాట్లాడుతున్నానని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతిస్తూనే ఉన్నానని తెలిపారు. అయితే ఇపుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి తాము మాట్లాడకపోతే..మోడీ ప్రభుత్వం తర్వాత సింగరేణి కాలరీస్ ను ప్రైవేటీకరణ చేస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా  జర్మనీకి చెందిన మార్టిన్ నీమోల్లర్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  ‘ఇతరుల సమస్యలపైన నువ్వు మాట్లాడకపోతే ..చివరికి నీ సమస్యపై మాట్లాడడానికి ఎవరూ మిగలరని అర్థం వచ్చే  కొటేషన్ ను కేటీఆర్  ట్వీట్ చేశారు.

https://twitter.com/KTRBRS/status/1642518709855191040

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని ఏప్రిల్ 2న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. వర్కింగ్ క్యాపిటల్ ,నిధుల సమీకరణ పేరుతో ప్లాంట్ ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర పన్నారని విమర్శించారు. కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్ష ల కోట్లను ప్రధాని మోడీ మాఫీ చేశారని..ఇదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎందుక లేదని నిలదీశారు కేటీఆర్.