అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం: కేటీఆర్

అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం: కేటీఆర్

బూతులు తిట్టినా.. అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పోరాటం తమకు కొత్త కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించారని విమర్శించారు.  

రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేశారని విమర్శించారు.అవసరమైతే ఢిల్లీ  వెళ్లి ఎండగడతామన్నారు. వదిలిపెట్టం, నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Also Read :- 8 మంది ఐఏఎస్ల బదిలీ

 రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేస్తుండగా పోలీసులు తీసుకెళ్తున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్.