బండి సంజయ్, అర్వింద్‌‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

బండి సంజయ్, అర్వింద్‌‌కు  కేటీఆర్ లీగల్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా తన​ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ​చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని బీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​మండిపడ్డారు. ఇప్పటికే సంజయ్‌‌పై సిటీ సివిల్​ కోర్టులో పరువు నష్టం కేసు నడుస్తున్నా.. మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

శనివారం  బండి సంజయ్‌‌తో పాటు ఎంపీ అర్వింద్‌‌కు కేటీఆర్‌‌‌‌ లీగల్​నోటీసులు పంపించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని.. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.