ఎమ్మెల్యేలపై కోపం ఉన్నా.. కేసీఆర్ మొహం చూసి ఓటేయండి: కేటీఆర్

ఎమ్మెల్యేలపై కోపం ఉన్నా.. కేసీఆర్ మొహం చూసి ఓటేయండి: కేటీఆర్

తెలంగాణలో భూముల ధరలు రెట్టింపు అవుతాయని గతంలోనే  చెప్పామని.. దీనికి ముఖ్య కారణం రాష్ట్ర అభివృద్ధి, పని చేసే నాయకులేనని అన్నారు. గతంలో రైతులకు కరెంటు కష్టాలు అన్ని ఇన్ని కావు.. కరెంటు లేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, కానీ ఈరోజు ఆ పరిస్థితి కనిపించట్లేదన్నారు. ఏ రైతుని అడిగినా ధీమా వ్యక్తం చేస్తున్నాడని చెప్పారు. హైదరాబాదులోనే కాదు రాష్ట్ర మొత్తం కూడా భూమి ధరలు పెరిగాయని..ఎలాంటి నష్టం వచ్చిన నాకు ఆస్తి ఉందనే ధైర్యం రైతుల్లో కనిపిస్తుందని చెప్పారు. కెసిఆర్ పై ఎన్నో విమర్శలు ఉన్నాయని.. అవన్నీ నిజం అయితే అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. స్థిరమైన నాయకత్వం ఉంది కాబట్టే అభివృద్ధి సాధ్యమైందన్నారు. చందమామను ఏ రకంగా చూస్తే.. ఆ రకంగానే కనిపిస్తుందని ఆయన అన్నారు.  మేము కేవలం ఆరున్నర సంవత్సరాలు మాత్రమే పరిపాలించామని..68 సంవత్సరాల పరిపాలన ఏవిధంగా ఉంది.. ఆరున్నర సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచించాలన్నారు.

2023, నవంబర్ 14వ తేదీ మంగళవారం నగంలో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మీట్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఇంకా సమస్యలు కన్పిస్తున్నాయని.. గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ ఉపయోగించుకోలేక పోయిందన్నారు. కాంగ్రెస్ కథ కొత్త సీసాలో పాతసారాల ఉందని ఎద్దేవా చేశారు. గతంలో 10 గంటలు కరెంటు పోయినా అడగని జనం.. ఇప్పదు10 నిమిషాలు పోయిన అడుగుతున్నారని చెప్పారు. పర్ క్యాపిట ఇన్ కమ్ లో ను తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.  

ఇప్పటివరకు కేవలం నీళ్లు, నిధులు, నియామకాలపై మాత్రమే దృష్టి పెట్టామని... రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలపై కూడా దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పారు. గతంలో మూడు లక్షల మంది ఉండే ఐటీ ఉద్యోగుల సంఖ్యను 10 లక్షలు తెచ్చామని.. ఒక సంవత్సరం రూ.50 వేల కోట్లకు ఐటీ ఆదాయం పెరిగిందని అన్నారు. 44% ఉద్యోగాలు హైదరాబాద్ ఐటి నుండి వస్తున్నాయని చెప్పారు.జానారెడ్డికి కూడా సీఎం అయ్యే ఆశ ఉందని తెలుస్తుందని...  కాంగ్రెస్ పార్టీలో11మందికి సీఎం పదవిపై ఆశ ఉందన్నారు. అది నిజం అయితే ఆరు నెలలకొసారి సీఎం మారుతాడని విమర్శించారు.మేము 36 ఫ్లైఓవర్లు కడితే.. మోడీ రెండు ఫ్లైఓవర్లు కూడా కట్టలేకపోయాడని మండిపడ్డారు.

పదవి కోసమే గతంలో ఓల్డ్ సిటీలో మత చిచ్చులు పెట్టిందే కాంగ్రెస్ అని.. నక్సలిజం పెరిగింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ లు మాత్రమే గుర్తుకొస్తారన్నారు. కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే సిటీలోనే ఓట్ శాతం తగ్గుతూ వస్తుందని అన్నారు. ఢిల్లీలో అడగకుండా నిర్ణయాలు తీసుకునే ధైర్యం సీఎంకి ఉందని.. ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని అనుకోండని... ఎమ్మెల్యే అభ్యర్థిపై కోపం ఉన్నా కేసీఆర్ మొహం చూసి ఓటేయండని కేటీఆర్ కోరారు.  

 ALSO READ : వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలి : సరోజావివేక్