బంగారు తెలంగాణ కాదు.. బండల తెలంగాణ చేసిండు : సరోజా వివేకానంద్

బంగారు తెలంగాణ కాదు.. బండల తెలంగాణ చేసిండు : సరోజా వివేకానంద్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం బురుగుపల్లి గ్రామంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంగళ హారతులు, డప్పు చప్పుళ్లతో సరోజకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పై సరోజా వివేకానంద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి వస్తే.. బంగారు తెలంగాణ అవుతుందని సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాదు.. బండల తెలంగాణ చేసిండని సరోజా వివేకానంద్ అన్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా భీమారం జడ్పీటీసీ బుక్య తిరుమల కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుమలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 

ALSO READ : కేసీఆర్, బాల్క సుమన్ లు జైలుకు వెళ్లడం ఖాయం