ఫ్యూచర్ సిటీలో భూములెవరు కొన్నా.. వెనక్కి తీసుకుంటం 

ఫ్యూచర్ సిటీలో భూములెవరు కొన్నా.. వెనక్కి తీసుకుంటం 
  • రెండేండ్లలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేటీఆర్​
  • అణచివేత పెరిగితే గడ్డిపోచలు గడ్డపారలైతయ్
  • సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజలు కేసీఆర్‌‌ను గుర్తు చేసుకుంటూనే ఉన్నరు 


గండిపేట/నాగర్​కర్నూల్, వెలుగు: రెండేండ్లలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని.. ఫ్యూచర్​ సిటీలో భూములెవనరూ కొన్నా వెనక్కి తీసుకుంటామని బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని పుప్పలగూడ, మణికొండ ప్రాంతాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడి మరో నెలలో మూడేండ్లు పూర్తవుతాయి. పది, పదకొండు రోజులుగా హైదరాబాద్‌‌‌‌లో ఒక నేతకు నిద్ర పట్టడం లేదు. పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ పెట్టి ఏ పాట పెట్టాలి.. ఏ పాట పెట్టకూడదని చెప్పే పరిస్థితి వచ్చింది.

 శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు డీజేలను బంద్‌‌‌‌ చేస్తున్నారు. అణచివేత ఎక్కువైతే సందర్భం వచ్చినప్పుడు గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి. 30 శాతం కమీషన్లు తీసుకుంటూ రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వ్యవస్థను కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం కుప్పకూల్చింది. ఫార్మాసిటీకి చెందిన భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే చట్టం ఒప్పుకోదు. రెండేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అక్కడ ఇంచు భూమి ఎవరు కొన్న వెనక్కి తీసుకుంటాం. ‘ది ప్యారడైజ్‌‌‌‌’ సినిమాలో కేసీఆర్‌‌‌‌ పాత్ర నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తమకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చిన నాయకుడిని ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటున్నారో అందులో కనిపిస్తుంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజలు కేసీఆర్‌‌‌‌ను గుర్తు చేసుకుంటూనే ఉన్నరు.  కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌‌‌‌రెడ్డి, రాజేంద్రనగర్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి పట్లోళ్ల కార్తిక్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఎత్తిపోతల నీళ్లు ఇయ్యరు.. కరెంట్​ వదలరు  

ఏడాది ఓపిక పడితే కేసీఆర్​సార్​ వస్తాడని, రైతులను గుండెల్లో పెట్టి చూసుకుంటాడని కేటీఆర్ భరోసా ఇచ్చారు.  ఆదివారం కొల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్​రెడ్డి తండ్రి దశదిన కర్మలో పాల్గొని తిరిగి వెళ్తూ నాగర్​కర్నూల్​ మండలం దేశీ ఇటిక్యాలలో పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ‘ఎల్ నినో ప్రభావం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరించినా ప్రభుత్వం వర్షపు నీళ్లను ఒడిసిపట్టలేదు. కృష్ణానదిలో నీళ్లున్నా ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడవడంలేదు.  40% పంటలు ఎండిపోయాయి. రంగుమారిన పత్తికి సగం ధర కూడా రావడంలేదు. నీళ్లిస్తే యూరియా, రైతుబంధు, మద్దతు ధర ఇవ్వాల్సి
వస్తుందని, ఇవన్ని ఎగ్గొట్టేందుకు ప్రాజెక్టుల నుంచి నీళ్లు, వ్యవసాయ మోటర్లకు కరెంట్​బంద్​ పెట్టారు’ అని ఫైరయ్యారు. మాజీ మంత్రులు శ్రీనివాస్​ గౌడ్​, డా.లక్ష్మారెడ్డి, జగదీశ్​​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​ రెడ్డి, ఆల వెంకటేశ్వర్​ రెడ్డి.. కేటీఆర్ వెంట ఉన్నారు. 

 8 వేల ఎకరాల భూమిపై శ్వేతపత్రం విడుదల చెయ్
సీఎం రేవంత్​కు కేటీఆర్ బహిరంగ లేఖ​

హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్​నేతలు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న సీఎం రేవంత్​రెడ్డి ఆరోపణలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్​ నేత  కేటీఆర్​అన్నారు. తమ పార్టీ నేతలు ఆక్రమించిన భూముల్లో 2400 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్న మాటల్లోనూ నిజం లేదన్నారు. సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్ వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం మీద కేవలం 1,272 ఎకరాలు, అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 204 ఎకరాలు మాత్రమే పంపిణీ జరిగిందని గుర్తుచేశారు. రికవరీ చేసినట్లు చెబుతున్న 2,400 ఎకరాలు ఏ గ్రామంలో ఉన్నాయి? వాటి సర్వే నంబర్లు ఏమిటి? ఎవరి పేర్ల మీద ఉన్నాయి? అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలన్నారు. శ్వేతపత్రం విడుదల చేయలేని పక్షంలో సిరిసిల్ల ప్రజలకు సీఎం రేవంత్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.