సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ లో KTR ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ లో KTR ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గైనకాలజిస్ట్ లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న కేటీఆర్ హాస్పిటల్ కు వచ్చారు. డాక్టర్లు లేక…, గర్భిణులను కరీంనగర్ కు రిఫర్ చేయడంతో వారు అక్కడికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్నారు.

గైనకాలజిస్ట్ ను వెంటనే నియమించాలన్నారు. వారు సరిగా పని చేయకపోతే బయట కూడా ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. అప్పటికప్పుడు తెలంగాణ వైద్య విధానమండలి ఉన్నతాధికారులతోనూ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు.
జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో మొత్తం నలుగురు గైనకాలజిస్టులను నియమించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఫోన్ చేసి కోరారు కేటీఆర్.