
- కాంగ్రెస్ పై అటాక్ చేయండి.. నేతలకు కేటీఆర్ డైరెక్షన్
- గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ కొత్త వ్యూహం
- బీజేపీని విమర్శిస్తే ఆ పార్టీకే మైలేజీ వస్తుందన్న ఆలోచన
- అందుకే తేలికగా తీసుకోవాలన్న కేటీఆర్
బీజేపీ నాయకులు చేసే విమర్శలను లైట్ గా తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ ఆదేశించారు. కాంగ్రెస్ నేతలుచేసే విమర్శలపై మాత్రం తీవ్రంగా స్పందించాలన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ జనరల్ పై సెక్రటరీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్..బీజేపీపై ఎలాంటి వైఖరితో ఉండాలో నేతలకు ఆయన సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలకు వెంటనే కౌంటర్ ఇవ్వాలన్నారు. ఇందుకోసం సబ్జెక్టుల వారీగా ఎమ్మెల్యేలు, లీడర్లు టీంగా ఏర్పడాలని సూచించారు.సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేసే విమర్శలను పట్టించుకోవద్దని, కాంగ్రెస్ పోస్టిం గ్ లకు మాత్రం వెంటనే కౌంటర్ ఇవ్వాలని పార్టీసోషల్ మీడియాసెల్ ను ఆదేశించారు. కరోనా వైరస్ ఇప్పట్లో అంతమయ్యేలా లేదని, లీడర్లు జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్ సూచించారు. ప్లాస్మా దాతలపై ఫోకస్ పెట్టి, వారిని ప్రోత్సహించాలని కోరారు. దళితుల అంశంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని విప్గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీఎం.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఆయన ఆదేశించారు. దీంతో వారు మీడియా ముందుకు వచ్చికాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
15 లోపు జిల్లా పార్టీ ఆఫీసుల ప్రారంభం
నిర్మాణం పూర్తయిన కొన్ని జిల్లా టీఆర్ఎస్ ఆఫీసులను ఈ నెల 15 లోపు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కేటీఆర్ చెప్పారు. జిల్లాల్లో పార్ని బలోపేతం చేసేందుకు జిల్లా కో ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. కొన్నిమున్సి పాల్టీల్లో పార్ కమిటీల ఏర్పాటు పెండింగ్ లో పడిందని, వాటిని త్వరలో నియమిస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ సీటు కోరిన సీతారాం నాయక్
గవర్నర్ కోటాలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కేటీఆర్ను మాజీ ఎంపీ సీతారాం నాయక్ కోరినట్లు సమాచారం. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. సీతారాంనాయక్కు ఎమ్మెల్సీపదవి ఇవ్వాలని కేటీఆర్ ను ఎంపీ, మంత్రి కోరినట్టు తెలిసింది.గతంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని, ఆటైంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కేటీఆర్ దృష్టికి వాళ్లుతెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రేటర్ ఎన్నికలవ్యూహంలో భాగమేనా?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్టు చర్చ జరుగుతోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నది. ఇదే టైంలో కరోనాకట్టడిలో రాష్ట్రసర్కారు ఫెయిలైందని సిటీ ప్రజలు భావిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. ఇలాంటి సమయంలో బీజేపీ నేతల విమర్శలకు స్పందిస్తే ఆ పార్టీ బలోపేతం అయ్యే చాన్స్ ఉంటుందని, అందుకే బీజేపీని లైట్ గా తీసుకుని, కాంగ్రెస్పై మాత్రమే అటాక్ చేయాలని కేటీఆర్ ఆదేశించినట్టు గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్లీడర్ ఒకరు చెప్పారు. ‘‘గ్రేట ర్ పరిధిలో బీజేపీకి కేడర్ ఉంది. ఆ పార్పై విమర్శలు చే టీ స్తే, బీజేపీ కేడర్ యాక్వ్ టి అవుతోంది. అందుకే ఎలాంటి విమర్శలు చేయం’’ అని ఆ లీడర్ వివరించారు