KTR షెడ్యూల్ ఫిక్స్ : మార్చి 6 నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో టూర్

KTR షెడ్యూల్ ఫిక్స్ : మార్చి 6 నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో టూర్

TRS పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది పార్టీ నాయకత్వం. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 16 నియోజకవర్గాల్లో నిర్వహించబోయే పార్టీ సన్నాహక సమావేశాల్లో  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. మార్చి 6న కరీంనగర్ లో మొదలయ్యే ఈ సమావేశాలు.. మార్చి 17 వరకు కొనసాగుతాయి. చివరిరోజున నల్గొండ, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ సమావేశం అవుతారు.

కేటీఆర్ టూర్ షెడ్యూల్

మార్చి 6 – కరీంనగర్

మార్చి 7 – వరంగల్, భువనగిరి

మార్చి 8 – మెదక్, మల్కాజిగిరి

మార్చి 9 – నాగర్ కర్నూలు/వనపర్తి , చేవెళ్ల

మార్చి 13 – జహీరాబాద్ / నాగార్జున సాగర్ , సికింద్రాబాద్

మార్చి 14 – నిజామాబాద్, ఆదిలాబాద్

మార్చి 15 – పెద్దపల్లి/రామగుండం

మార్చి 16 – మహబూబాబాద్, ఖమ్మం

మార్చి 17 – నల్గొండ, మహబూబ్ నగర్