కామారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. దాబా దగ్గర ఆగిన ట్రక్కులో రూ. 10 లక్షల సెల్ ఫోన్లు లూటీ..

కామారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. దాబా దగ్గర ఆగిన ట్రక్కులో రూ. 10 లక్షల సెల్ ఫోన్లు లూటీ..

కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. జిల్లాలోని టేక్రియాల్ హైవే దగ్గర  భారీ చోరీ జరిగింది.. హైవే దగ్గర ఆగి ఉన్న ట్రక్కులో నుంచి రూ. 10 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. శనివారం ( జులై 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ జాతీయ రహదారి దగ్గర ఓ ట్రక్కులో నుండి సుమారు రూ. 10 లక్షల విలువైన సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు దారి దోపిడి దొంగలు.హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ఆ ట్రక్కును ఓ దాబా దగ్గర విశ్రాంతి కోసం నిలిపిన సమయంలో ఘటన చోటు చేసుకుంది.

విశ్రాంతి కోసం రోడ్డు సైడ్ ట్రక్కు ఆపిన డ్రైవర్ నిద్రలేచి చూడగానే అవాక్కయ్యాడు. ట్రక్కులో నుండి సెల్ ఫోన్ డబ్బాలు ఎత్తుకెళ్లారని గుర్తించిన డ్రైవర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రక్కు డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : అప్పుడు 90 డిగ్రీ‎స్.. ఇప్పుడు Z- షేప్.. అసలు ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఐడియాలు..!