
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్ మరో సాహసోపేతమై ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీతో కలిసి సరికొత్త భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం AA22 x A6 ( వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ కెరీర్ లో అత్యంత గొప్ప చిత్రంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అటు అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించిన మరో శుభవార్త తెరపైకి వచ్చింది.
నాలుగు తరాల పాత్రల్లో అల్లు అర్జున్
AA22 x A6 చిత్రానికి ప్రధాన ఆకర్షణ అల్లు అర్జున్ పోషించనున్న క్వాడ్రపుల్ రోల్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. అంటే, అతను ఒక తాతగా, తండ్రిగా, మరియు ఇద్దరు కొడుకులుగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నాడు. "ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఒక మైలురాయి. ఇలాంటి క్లిష్టమైన సినిమాటిక్ సవాల్‌ను ఎంచుకోవడం మాములు విషయం కాదని అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక పూర్తి కుటుంబానికి చెందిన నలుగురి పాత్రలను ఒకే నటుడు ప్రాణం పోయడం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన ఘట్టం అవుతుందంటున్నారు.
►ALSO READ | శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పరి'పై విమర్శల దాడి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. కారణం ఇదే!
తొలుత దర్శకుడు అట్లీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ ను డబుల్ రోల్ గా మాత్రమే ప్లాన్ చేశారు. వృద్ధ పాత్రల కోసం వేర్వేరు నటులను తీసుకోవాలని భావించారు. అయితే, నాలుగు పాత్రలను తానే పోషిస్తానని అల్లు అర్జున్ ప్రతిపాదించాడని టాక్. దీనికి అట్లీ సంశయించారు, కానీ లుక్ టెస్ట్‌లు నిర్వహించిన తర్వాత అతను పూర్తిగా ఒకే చెప్పినట్లు సమాచారం. ఇది కేవలం వర్కౌట్ అవ్వడమే కాదు - సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రేక్షకులు ఒకే చిత్రంలో అల్లు అర్జున్ ను నాలుగు విభిన్న షేడ్స్‌ను చూడగలరు, ప్రతి పాత్రకు ప్రత్యేకమైన నడక, బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్‌తో అదరగొట్టనున్నారని భావించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అల్లు అర్జున్ నటనకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని, జాతీయ అవార్డులను కూడా సాధించవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
నలుగురు హీరోయిన్లు..
ఈ భారీ బడ్జెట్ ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం ముంబైలో భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ AA22 x A6 చిత్రాన్ని 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో థియేట్రికల్ విడుదల చేసేందుకు మూవీ మేకర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మల్టీలింగ్వల్ విజువల్ వండర్‌లో దీపికా పదుకొనే ( Deepika Padukone ), రష్మిక మందన ( Deepika Padukone) , జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) , మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) వంటి స్టార్ హీరోయిన్లు నటించనుండడంతో ఈ సినిమా భారతీయ సినిమాలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం పాన్-ఇండియా సినిమానే కాకుండా, పాన్-గ్లోబల్ సినిమా స్థాయిలో రిక్డాలు సృష్టిస్తుందన్న అంచనాలు సినీ ఇండస్ట్రీలో నెలకొన్నాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లుఅర్జున్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.