గత పదేళ్లలో ఇలాంటి నాన్సెన్స్ చూశారా.?: కేటీఆర్

గత పదేళ్లలో ఇలాంటి నాన్సెన్స్ చూశారా.?: కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. మియాపూర్లో ప్రభుత్వ భూమిలో మహిళలు గుడిసెలు వేసేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకున్న ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. 

నో లా.. నో ఆర్డర్. గత పదేళ్లలో ఇలాంటి నాన్సెన్స్ మీరు చూశారా? అంటూ ప్రశ్నించారు.  తెలంగాణలో  శాంతి భద్రతల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్ అసమర్థ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందన్నారు.  హైదరాబాద్ లోని మియాపూర్‌లో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు.

జూన్ 22నన  మియాపూర్ లోని  ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నంబర్ 100,101 లో తమకు పట్టాలివ్వా లని పలువురు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.