ఎవరో గుర్తు పట్టారా.? మన రాష్ట్ర మంత్రి గారే

ఎవరో గుర్తు పట్టారా.? మన రాష్ట్ర మంత్రి గారే

ఈ ఫోటోలోని ఉన్నదెవరో గుర్తు పట్టారా.? మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్. కేవలం సీఎం కేసీఆర్ వారసుడిగానే కాకుండా అటు రాజకీయాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చాలా కీలకంగా ఉండే కేటీఆర్.. ఆదివారం నాడు త‌న పాత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తొలిసారి ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్ప‌టి ఫొటోను ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి ఆనాటి జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ఈ ఫోటోని చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు.. సినిమా హీరోలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.