డైనమిక్ లీడర్ హరీష్.. హ్యాపీ బర్త్ డే : KTR

డైనమిక్ లీడర్ హరీష్.. హ్యాపీ బర్త్ డే : KTR

టీఆర్ఎస్ కీలక నాయకుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు. డైనమిక్ లీడర్ హరీష్ రావుకు హృదయపూర్వక పుట్టినరోజులు శుభాకాంక్షలు అందజేస్తున్నా అని చెప్పారు కేటీఆర్.

ఆరోగ్యం, ప్రశాంతత, సంతోషం, సుదీర్ఘ ప్రజా జీవితం హరీష్ రావుకు దక్కాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

దీంతోపాటు… హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ టీఆర్ఎస్ సభలో పాల్గొన్న ఓ ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా… హరీష్ రావు నవ్వుతూ వింటున్నట్టుగా ఆ ఫొటో ఉంది.

కేటీఆర్ విషెస్ పోస్ట్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన పోస్టుకు వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్స్, కామెంట్స్ వస్తున్నాయి.