జీఎస్టీ పెంపుపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

జీఎస్టీ పెంపుపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్  : వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. జీఎస్టీ పెంపు వల్ల దేశంలో వస్త్ర, చేనేత పరిశ్రమ కుదేలవుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగంపై ఆధారపడిన కోట్లాది మంది కార్మికుల జీవితాలు దెబ్బ తింటాయని లేఖలో వివరించారు. జీఎస్టీ పెంపుతో చేనేత, జౌళి పరిశ్రమ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. టెక్స్ టైల్, అప్పారెల్ యూనిట్లు మూతపడి లక్షలాది మంది రోడ్డున పడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనిపక్షంలో వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాడినట్లే నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు. జీఎస్టీ పెంపును విరమించుకునే వరకు వస్త్ర పరిశ్రమకు, నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

ఐఫోన్ ఆర్డర్ చేస్తే చాక్లెట్ వచ్చింది

కరోనా ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతాం