
బషీర్బాగ్, వెలుగు: నృత్య దీక్షాలయ- ది గేట్వే ఆఫ్ కూచిపూడి ఆధ్వర్యంలో నృత్యార్పణం -ఎ డివైన్ ఆఫరింగ్ 8వ సంచికను సోమవారం సాయంత్రం బషీర్ బాగ్ భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. రంగపూజతో ప్రారంభమై గణేశ కౌత్వం, జగదానందకారక, జతిస్వరమ్, శంకరి(8వ కామాక్షి నవావరణ కృతి), కొలువైతివా, శ్రీష పద్మనాభ, అష్టలక్ష్మి వంటి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా కళారత్న డాక్టర్సత్యప్రియ కాత్యాయని కనక్, నృత్య దీక్షాలయ వ్యవస్థాపకురాలు లక్ష్మిశంకర్ హాజరై యువ నృత్యకారులను అభినందించారు.