నాలాపై మొబైల్.. ల్యాప్ టాప్ దుకాణాలు ..నేలమట్టం చేసిన హైడ్రా

నాలాపై మొబైల్.. ల్యాప్ టాప్ దుకాణాలు ..నేలమట్టం చేసిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్‌‌‌‌పల్లి ఏవీబీ పురంలోని పరికి చెరువు నుంచి కలిసే నాలాలో ఆక్రమణలను హైడ్రా సోమవారం తొలగించింది. 10 మీటర్ల వెడల్పు గల నాలా 3 మీటర్లకు పైగా ఆక్రమణకు గురైంది. నాలాతోపాటు మ్యాన్​హోల్​పై రెండు షట్టర్లు నిర్మించారు. ఇందులో సెల్‌‌‌‌ఫోన్, ల్యాప్​టాప్ విక్రయ, రిపేర్లు దుకాణాలు నడుస్తున్నాయి. ఈ ఆక్రమణలతో సాయిబాబా కాలనీ, హెచ్‌‌‌‌ఏఎల్ కాలనీ, మైత్రినగర్​లో వర్షం పడినప్పుడు వరద ముంపు ఏర్పడుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. జలమండలి నివేదిక ఆధారంగా హైడ్రా కూల్చివేతలు చేపట్టగా, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.