పేకాటరాయుళ్లు: కూకట్ పల్లిలో 11 మంది అరెస్ట్ ..పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తండ్రి కొండలరావు

పేకాటరాయుళ్లు: కూకట్ పల్లిలో 11 మంది  అరెస్ట్ ..పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తండ్రి కొండలరావు
  • గెస్ట్​హౌస్​లో ఎమ్మెల్సీ తండ్రి, కార్పొరేటర్ పేకాట
  • కూకట్​పల్లిలో ఎస్ఓటీ పోలీసుల దాడి..మొత్తం 11 మంది అరెస్టు

కూకటపల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని ఓ గెస్ట్​హౌస్​లో పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం బాలానగర్​ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కూకట్​పల్లికి చెందిన బీఆర్ఎస్​ఎమ్మెల్సీ నవీన్​కుమార్​తండ్రి కొండలరావుతో పాటు ఆల్విన్​కాలనీ డివిజన్​కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్​దొడ్ల వెంకటేశ్​గౌడ్​ ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

కూకట్​పల్లి పరిధి వైష్ణవికాలనీలోని ప్లాట్​నంబర్​27లో ఉన్న గెస్ట్​హౌస్​లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కొండలరావు, వెంకటేశ్ గౌడ్​తోపాటు తులసిరావు, బలరావు, అనిల్​కుమార్​, భాస్కర్​రావు, శ్రీనివాసరావు, భాస్కర్​, రంగారావు, నాగేశ్వరరావు, మురళీమోహన్​అరెస్ట్​చేశారు. నిందితుల నుంచి రూ. 2.52 లక్షల నగదు, 11 మొబైల్​ ఫోన్స్​స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని కూకట్​పల్లి పోలీసులకు అప్పగించారు.