కల్తీ కల్లు ఘటన: కల్లు కాంపౌండ్ ఓనర్ మాస్టర్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

కల్తీ కల్లు ఘటన: కల్లు కాంపౌండ్ ఓనర్  మాస్టర్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో  సీన్ రివర్స్

హైదరాబాద్ కూకట్ పల్లిలో కలకలం సృష్టించిన కల్తీకల్లు  కేసు వ్యవహారంలో  కల్లు కాంపౌండ్ ఓనర్  స్కెచ్ మామూలుగా లేదు.  కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ  అస్వస్థకు గురికావడంతో నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది.  చికిత్స పొందుతూ ఆమె  జులై 8న మృతి చెందింది.  అయితే ఈ విషయం తెలుసుకున్న కల్లు కాంపౌండ్ ఓనర్ గుట్టు చప్పుడు కాకుండా మ్యాటర్  బయటకి రాకుండా ప్లాన్ వేసి జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో స్వరూప మృతదేహన్ని అంత్యక్రియలు చేసేందుకు తీసుకువెళ్లాడు  ఆమె కొడుకు ,  కుటుంబ సభ్యులు. 

అయితే   కల్తీ కల్లు తాగే మరణించిందని KPHB పోలీసులకు సమాచారం రావడంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు స్వరూప  అంత్యక్రియలను మధ్యలోనే ఆపేశారు . స్వరూప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. స్వరూప కొడుకు దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకున్నారు కేపీహెచ్ బీ పోలీసులు. 

హైదరాబాద్ కూకట్ పల్లిలో మంగళవారం (జులై 08) కల్తీ కల్లు తాగి 19 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కూకట్​పల్లిలోని ఉషాముళ్లపూడి రోడ్డులో కల్లు కాంపౌండ్​, కేపీహెచ్​బీలోని హైదర్​నగర్,  ఎల్లమ్మబండ ప్రాంతంలోని కల్లు కాంపౌండ్ లో సాయంత్రం కొంతమంది కల్లు తాగారు. కాసేపటికి వారంతా అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతోపాటు బాధితులకు విరేచనాలు కూడా అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు వారిని కూకట్​పల్లిలోని రాందేవ్​ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ( బుధవారం) ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. 

►ALSO READ | కెమిస్ట్రీ టీచర్స్..ఇంట్లోనే డ్రగ్స్ తయారీ..2 నెలల్లో 15 కోట్లు సంపాదించారు..!

కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలను రిస్క్ లో పెట్టిన నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపెక్షేంచికేది లేదని హెచ్చరించారు మంత్రి జూపల్లి. కల్లు శాంపిల్స్ ను కెమికల్ టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపించినట్లు చెప్పారు. ఈ ఘటనపైఎక్సైజ్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.