- అధిక సంఖ్యలో చేరుకున్న ఎమ్మెల్యే అనుచరులు
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద గురువారం రాత్రి హైడ్రామా నడిచింది. జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు అధిక సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నం జరుగుతుందన్న ప్రచారంతో ఇంటిలిజెన్స్వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి వెళ్లారు. దీంతో మరింత ప్రచారం జరిగి కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే ఇంటికి వద్దకు చేరుకుని కాపలా కాశారు. దాదాపు రెండు మూడు గంటలు టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఎమ్మెల్యే ముట్టడి ప్రయత్నాలు ఏమీ జరగకపోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

