- లేకుంటే నిరాహార దీక్షలు, హెచ్‌ఎండీఏ ముట్టడిలో పాల్గొంటాం
- రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
పంజాగుట్ట, వెలుగు: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే నిరాహార దీక్షల్లో, 25న హెచ్‌ఎండీఏ ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్తరఫున పాల్గొంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ట్రక్ పార్క్ భూముల వేలానికి వ్యతిరేకంగా గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ట్రక్ పార్క్ భూములను అమ్మితే వేలాది మంది డ్రైవర్లు, కార్మికుల బతుకులు రోడ్డున పడతాయన్నారు. 2008–-09లోనూ ఈ భూముల విక్రయాన్ని బీఆర్‌ఎస్, వామపక్షాలు కలిసి అడ్డుకున్నాయని చెప్పారు. ప్రజల ఆస్తులను అమ్మడం మానుకుని సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సీపీఎం నేత జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రైతులకు చెందిన 33 ఎకరాల భూమిని ప్రజాప్రయోజనాలకే వినియోగించాలన్నారు.
న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ మాట్లాడుతూ.. వేలాన్ని రద్దు చేసే వరకూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
