న్యూఢిల్లీ: ఐపీఎల్–19 ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు కీలక మార్పులు చేశాయి. గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఆటగాళ్ల స్థానాల్లో కొత్త ప్లేయర్లను భర్తీ చేశాయి.
ఖలీల్ అహ్మద్ స్థానంలో ఢిల్లీ ఎడమచేతి వాటం పేసర్ కుల్దీప్ యాదవ్‌ను సీఎస్‌కే జట్టులోకి తీసుకోగా... నువాన్ తుషార స్థానాన్ని ఇంగ్లాండ్
ఆటగాడు రిచర్డ్ గ్లీసన్‌తో ఆర్‌సీబీ భర్తీ చేసింది. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
