ఆ ఒక్క సమస్య కూడా తీరినట్టేనా..? బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న భారత బౌలర్లు

ఆ ఒక్క సమస్య కూడా తీరినట్టేనా..? బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న భారత బౌలర్లు

 

టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో విభాగాల్లో ఎంత స్ట్రాంగ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ తో పాటు పదునైన బౌలింగ్ మన జట్టు సొంతం. దీనికి తోడు జడేజా, హార్దిక్ పాండ్య రూపంలో ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్లు ఉండనే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎప్పటి నుంచో టీమిండియాను వేధిస్తున్న ప్రశ్న బ్యాటింగ్ లో డెప్త్ లేకపోవడం.
 
ఇతర జట్లతో పోల్చుకుంటే టీమిండియా లోయర్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉందనే మాట వాస్తవం. జడేజా తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ చాలా అద్వానంగా ఉంది. సిరాజ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ వీరెవ్వరూ కూడా కనీస స్థాయిలో బ్యాటింగ్ చేయలేరు.టీమిండియా ఒక్కసారి 6 వికెట్లు కోల్పోయిందంటే ఇక ఆలౌటైనట్టే. బ్యాటింగ్ భారాన్ని మోయాల్సింది బ్యాటర్లే అయినా కొన్ని సందర్భాల్లో బౌలర్లు కూడా బ్యాట్ కి పని చెప్పాల్సి ఉంటుంది. బ్యాటర్లందరూ పెవిలియన్ కి క్యూ కట్టిన సమయంలో ఎంతో కొంత ఆడాలి. కానీ టీమిండియా బౌలరలు మాత్రం మాకు సంబంధం లేదన్నట్లుగా చేతులెతేశారు.

ALSO READ :మా పేస్ బౌలింగ్ తో అంత ఈజీ కాదు..టీమిండియాకు బాబర్ అజామ్ స్ట్రాంగ్ వార్నింగ్ 
 
అయితే ఇప్పుడు లోయర్ ఆర్డర్ కూడా బ్యాటింగ్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆసియా కప్ లో భాగంగా రేపు కొలొంబో వేదికగా పాక్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిరాజ్ తన బ్యాట్ కి పని చెప్పగా కుల్దీప్ అర్ధ గంట సేపు టాప్ బ్యాటర్లతో కలిసి ప్రాక్టీస్ చేసాడు. మొత్తానికి ఇలా భారత బౌలర్లు కూడా నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం టీమిండియాకు అనుకూలంగా మారనుంది. మరి రేపు పాకిస్థాన్ మీద మ్యాచ్ వీరికి బ్యాటింగ్ అవకాశం వస్తుందో రాదో చూడాలి.